ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో, నర్సీపట్నం అల్లూరి సీతారామరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 5వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహించబడుతుంది. ఈ మేళాలో సుమారు 12 కంపెనీలు పాల్గొని, పదవ తరగతి నుండి పిజి వరకు చదువుకున్న 18-35 ఏళ్ల యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి ఎన్. గోవిందరావు బుధవారం ఈ వివరాలను వెల్లడించారు. ఆసక్తిగల నిరుద్యోగులు తమ వివరాలను వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని సూచించారు.