మాడుగుల మండలం సాగరం పంచాయతీ వాడపాడులో శుక్రవారం రాత్రి ఓ కొండచిలువ కలకలం సృష్టించింది. గత వారం రోజులుగా కాలనీలో సంచరిస్తున్న సుమారు 10 అడుగుల కొండచిలువ కోడి పిల్లలను తింటున్నట్లు గమనించిన గ్రామస్తులు, దానిని కర్రతో కొట్టి చంపేశారు. జనావాసాల మధ్య పాముల సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.