మాడుగుల;శ్రీ మహాచండీ దర్శనం మోక్ష సిద్ధి

4చూసినవారు
మాడుగుల;శ్రీ మహాచండీ దర్శనం మోక్ష సిద్ధి
దసరా నవరాత్రులలో ఏడవరోజు ఆదివారం, మాడుగుల దుర్గాదేవి అమ్మవారు శ్రీ మహా చండీ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. మహ ఉగ్రరూపాల్లో చండీ ఒకటి. ఈ రూపంలో అమ్మవారిని పూజిస్తే మోక్షం లభిస్తుందని, శత్రువులు మిత్రులవుతారని భక్తుల విశ్వాసం. దుష్ట శక్తుల అహంకారాన్ని అణచడానికి అమ్మవారు ఈ రూపంలో అవతరించారని నానుడి. ఈ రోజు అమ్మవారికి చక్కెర పొంగళి, చలివిడి, వడపప్పులను నైవేద్యంగా సమర్పిస్తారు. పసుపు రంగు చీరను అలంకరిస్తారు. పసుపు వర్ణపు (కదంబ పుష్పం)తో అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు సిద్ధిస్తాయని పురాణగాథ ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్