విద్యుత్ ఏఈపై ఎంపీపీ ఫైర్

279చూసినవారు
విద్యుత్ ఏఈపై ఎంపీపీ ఫైర్
చీడికాడ మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో విద్యుత్ ఏఈని ఎంపీపీ కురచ జయమ్మ నిలదీశారు. ఒక విద్యుత్ కనెక్షన్ కోసం రూ.20,000 అడిగారని, ఎంపీపీకే ఇబ్బందులు పెడితే సామాన్యులకు సేవలు ఎలా అందిస్తారని ప్రశ్నించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ వెంటనే సమస్యను పరిష్కరించి కనెక్షన్ ఇవ్వాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్