మాడుగులలో 31న పింఛన్ల పంపిణీ

అనకాపల్లి జిల్లా మాడుగుల మండలంలో పింఛన్ లబ్ధిదారులకు అధికారులు శుభవార్త అందించారు. ఫిబ్రవరి 1వ తేదీ సెలవు దినం కావడంతో, లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా ఈనెల 31వ తేదీనే పింఛన్లను పంపిణీ చేయనున్నట్లు మాడుగుల ఎంపీడీవో కె.అప్పారావు తెలిపారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అవసరమైన నిధులను 30వ తేదీనే బ్యాంకుల్లోంచి తీసి, సచివాలయ సిబ్బందికి అందజేస్తారు. మండలంలో మొత్తం 11,462 మంది సామాజిక పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు లబ్ధిదారుల ఇంటికే పింఛన్ సేవలు చేరవేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
