చంద్రగ్రహణం కారణంగా మాడుగుల శ్రీమోదకొండమ్మ ఆలయాన్ని మంగళవారం మూసివేస్తున్నట్లు ఆలయ ఛైర్మన్ పుప్పాల అప్పలరాజు సోమవారం తెలిపారు. ఈ నెల 9వ తేదీ ఉదయం 9 గంటల నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు ఆలయం మూసివేయబడుతుంది. బుధవారం ఉదయం 7 గంటలకు అమ్మవారికి సంప్రోక్షణ అనంతరం, 10 గంటలకు భక్తులకు దర్శనం కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు.