
చెట్టు కూలి రోడ్డు మూసివేత, ఎస్పీ ఆదేశాలతో తొలగింపు
నర్సీపట్నం–తుని ప్రధాన రహదారిపై, బాలిఘట్టం వద్ద చెట్టు రోడ్డుపై పడిపోవడంతో సగభాగం మూసుకుపోయింది. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు, నర్సీపట్నం టౌన్ సీఐ గోవిందరావు వుడ్కట్టర్ సిబ్బందితో చెట్టును తొలగించే చర్యలు చేపట్టారు. నాతవరం ఎస్సై వై. తారకేశ్వరరావు పర్యవేక్షణలో చెట్టును కట్ చేసి రహదారిని పూర్తిగా క్లియర్ చేయడంతో వాహన రాకపోకలు సజావుగా కొనసాగుతున్నాయి. తుఫాన్ నేపథ్యంలో ఎస్పీ జారీ చేసిన ఆదేశాల మేరకు ఈ తక్షణ చర్యలు జరిగాయి.







































