నాటు కోళ్లకు పెరిగిన డిమాండ్

314చూసినవారు
నర్సీపట్నంలో సంక్రాంతి పండుగ సందర్భంగా నాటు కోళ్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. శనివారం ఉదయం మార్కెట్లో ఒక్కో కోడి ధర సుమారు రూ. 3 వేలు పలికింది. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు చెబుతున్న ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కోడిపందేలు జరగబోతున్న నేపథ్యంలో వీటికి డిమాండ్ పెరిగినట్లు కొందరు రైతులు పేర్కొన్నారు. ఈ ఒక్కరోజే లక్షల రూపాయల వ్యాపారం జరుగుతుందని అంచనా వేస్తున్నారు.

సంబంధిత పోస్ట్