నర్సీపట్నం; జాయింట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించిన స్పీకర్

4చూసినవారు
నర్సీపట్నం; జాయింట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించిన స్పీకర్
శనివారం అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు ఆధ్వర్యంలో ఎనిమిది జాయింట్ కమిటీల తొలి సమావేశం జరిగింది. స్పీకర్ కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం, ఈ కార్యక్రమంలో శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ సూర్యదేవర కూడా పాల్గొన్నారు. ఈ కమిటీలు ప్రజాస్వామ్యంలో కీలక పాత్ర పోషిస్తాయని, సభ్యులు జిల్లాలలో పర్యటించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని, చర్చించి, పరిష్కార మార్గాలను సూచించాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్