నర్సీపట్నం ఐదురోడ్ల కూడలిలో బుధవారం రాత్రి ట్రాఫిక్ రద్దీ ఏర్పడగా, శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు స్వయంగా కారు దిగి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. ప్రధాని
మోదీ పిలుపు మేరకు పొదుపు చర్యల్లో భాగంగా పైలట్, సెక్యూరిటీ వాహనాలు లేకుండా ఆయన బయటకు వెళ్లారు. రద్దీగా ఉన్న కూడలిలో హోంగార్డు లేకపోవడంతో, వీఐపీ హోదా చూపించకుండా సామాన్యుడిలా ఆయన అందించిన సేవ అందరి ప్రశంసలు అందుకుంది.