నాతవరం మండలం గన్నవరం గ్రామానికి చెందిన చింతరెడ్డి అచ్చురాజుకు చెందిన వరి కుప్ప అగ్నికి ఆహుతైంది. సంవత్సర కాలం కష్టపడి పండించిన పంటను ఇలా కోల్పోవడంతో రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ సంఘటనలో భారీగా ఆర్థిక నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతు కోరుతున్నాడు.