భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనుల తీరుపై వైఎస్సార్
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. ఆదివారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ హయాంలో ఎయిర్‌పోర్టు అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. ప్రయాణికులకు కనీసం మంచి నీళ్లు కూడా దొరకడం లేదని, కానీ బార్లలో బీరు అందుబాటులో ఉందని ఎద్దేవా చేశారు. ప్రయాణికుల కనీస అవసరాలను తీర్చడంలో ప్రభుత్వం విఫలమైందని బొత్స విమర్శించారు.