రాష్ట్రపతి పర్యటనకు వైజాగ్ సిద్ధం

1422చూసినవారు
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపటి విశాఖ పర్యటన నేపథ్యంలో, స్థానిక హోటల్‌లో ఏర్పాట్లను రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పర్యవేక్షించారు. విశాఖలో జరిగే మొట్టమొదటి కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి పాల్గొననున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఉన్నతాధికారులతో సమీక్షించిన మంత్రి అనిత, భద్రత, ప్రోటోకాల్ విషయంలో పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొంటారని, జిల్లా యంత్రాంగం, పోలీస్ కమిషనరేట్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయని మంత్రి వెల్లడించారు.

సంబంధిత పోస్ట్