ఆటో ఢీకొని ముగ్గురికి గాయాలు

1860చూసినవారు
ఆటో ఢీకొని ముగ్గురికి గాయాలు
చింతపల్లి మండలం గంజిగడ్డ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జోహార్ గ్రామానికి చెందిన కొర్ర కేశవ్, అతని భార్య జ్యోతి, కుమార్తె మీరా గాయపడ్డారు. ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కేశవ్ కుడి కాలు విరగగా, జ్యోతి, మీరాలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను మొదట చింతపల్లి ఏరియా ఆసుపత్రికి, ఆపై మెరుగైన చికిత్స కోసం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్