జనసేన పరిశీలకుడు దొరబాబుకు ఘన స్వాగతం

1197చూసినవారు
జనసేన పరిశీలకుడు దొరబాబుకు ఘన స్వాగతం
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకులుగా నియమితులైన పెండెం దొరబాబు అనకాపల్లి జిల్లాకు విచ్చేస్తున్న సందర్భంగా, సోమవారం పాయకరావుపేట తాండవ జంక్షన్ వద్ద జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పెండెం దొరబాబును శాలువాలు కప్పి, ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్