అనకాపల్లి జిల్లా నక్కపల్లి జాతీయ రహదారిపై సోమవారం ఉదయం ఓ వ్యాన్ ఢీకొని ముగ్గురు ఉపాధి కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. నక్కపల్లికి చెందిన బద్ద సత్యవతి, ఏనుగుపల్లి సత్యవతి, యాదగిరి చిన నూకమ్మ ఈ ప్రమాదంలో గాయపడ్డారు. పనికి వెళ్తుండగా వాహనం వీరిప
ైకి దూసుకొచ్చింది. స్థానికులు నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, బద్ద సత్యవతి పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.