పాయకరావుపేటలో పెట్రోల్, డీజిల్ కొరతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డిమాండ్‌కు తగిన సరఫరా లేకపోవడంతో పెట్రోల్ బంకుల వద్ద 'నో స్టాక్' బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఈ వార్తలతో ఆందోళన చెందిన వాహనదారులు, అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేసేందుకు సోమవారం తెల్లవారుజాము నుంచే బంకుల వద్ద బారులు తీరారు.