పాయకరావుపేట: దాడి కేసులో ఒకరు అరెస్ట్

630చూసినవారు
పాయకరావుపేట: దాడి కేసులో ఒకరు అరెస్ట్
పాయకరావుపేట మండలం మాసాహెబ్లో ఇంటి దారి విషయమై కత్తితో దాడి చేసిన బంటుమల్లి అయ్యారావును శుక్రవారం అరెస్టు చేసినట్లు సీఐ అప్పన్న తెలిపారు. టి.సత్యనారాయణతో జరిగిన గొడవలో అయ్యారావు కత్తితో దాడి చేసి పరారయ్యాడు. శుక్రవారం నిందితుడిని అరెస్టు చేసి ఎలమంచిలి కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు సీఐ వెల్లడించారు.