ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ ఆధ్వర్యంలో భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ మండలి రూపొందించిన డిజిటల్ లేబర్ చౌక్ యాప్‌లో టైల్స్, మార్బుల్, గ్రానైట్ రంగ కార్మికుల నమోదు కార్యక్రమం పాయకరావుపేటలో జరిగింది. ఎలమంచిలి సహాయ కార్మిక అధికారి కె. బాలకృష్ణ యాప్ సేవలు, నమోదు విధానం గురించి వివరించారు. ఈ డిజిటల్ విధానం ద్వారా కార్మికులకు ఉపాధి అవకాశాలు, సంక్షేమ పథకాలు మరింత చేరువవుతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ భద్రకాళి టైల్స్, మార్బుల్, గ్రానైట్ వర్కర్స్ సంక్షేమ సంఘం అధ్యక్షులు వెలగా శ్రీనివాస్, ఉపాధ్యక్షులు దాసరి విజయ్, ట్రెజరర్ గర్లంక శివరామకృష్ణ, సభ్యులు పాల్గొన్నారు.