నక్కపల్లి మండలం అమలాపురం గ్రామంలో స్టీల్ ప్లాంట్ కోసం నిర్వహించిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణలో నిర్వాసితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమలాపురం గ్రామానికి చెందిన మత్స్యకారులకు సంబంధించిన 43 ఎకరాలకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని, ఉప్పుటేరు ప్యాకేజీ ఇవ్వాలని, చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, శెట్టి బలిజలకు తాటి చెట్లకు పరిహారం చెల్లించి కుటుంబాలకు ప్యాకేజీ ఇవ్వాలని నిర్వాసితులు జిల్లా కలెక్టర్ ను కోరారు.