ఆలయంలో రెండు హుండీలు చోరీ

497చూసినవారు
ఆలయంలో రెండు హుండీలు చోరీ
నక్కపల్లి మండలం ఉపమాక వెంకన్న ఆలయంలో అర్ధరాత్రి దాటిన తర్వాత ఇద్దరు దొంగలు ఆలయంలోని రెండు హుండీలను విద్యుత్ కట్టర్లతో కట్ చేసి, అందులోని సుమారు రూ.2 నుంచి 3 లక్షల వరకు నగదును అపహరించుకెళ్లారు. ఉదయం పూజా కార్యక్రమాలకు వచ్చిన అర్చకులు దొంగతనాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ పరిశీలించి విచారణ చేపట్టారు. ఈ ఘటనపై హోంమంత్రి అనిత అధికారులతో మాట్లాడారు.

సంబంధిత పోస్ట్