అనకాపల్లి: చుక్కల మందుకు చక్కని ‍స్పందన

1490చూసినవారు
అనకాపల్లి: చుక్కల మందుకు చక్కని ‍స్పందన
పోలియో రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత అని రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్, అనకాపల్లి టీడీపీ ఇన్‌చార్జి పీలా గోవింద సత్యనారాయణ అన్నారు. పోలియో ఆదివారం సందర్భంగా నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ప్రభుత్వం చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రతి తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకుని ఐదేళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ మాజీ మేయర్ పీలా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్