సింహాచలంలో కొలువైన అప్పన్నస్వామికి ఆదివారం నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి స్వర్ణపుష్పాలతో ప్రత్యేక అభిషేకం చేశారు. శుప్రభాత వేళ మేల్కోలిపి సుగంధ ద్రవ్యాలతో శుద్ధి చేసిన అనంతరం ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఆలయ అధికారులు ఏర్పాట్లు పర్యవేక్షించారు.