బుధవారం మధ్యాహ్నం నగరంలోని సుజాతనగర్, నాయుడుతోట, దుర్గ నగర్, తాటిచెట్లపాలెం, రైల్వే న్యూ కాలనీ వంటి పలు ప్రాంతాల్
లో ఉరుములతో కూడిన వర్షం కురిసింది. బుధవారం ఉదయం నుంచి ఎండగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మేఘావృతంగా మారడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం ఆగినప్పటికీ వాతావరణం మేఘావృతమై ఉరుముతూనే ఉంది.