వైసీపీ మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్‌కు షాక్ ఇవ్వనున్న జగన్?

1129చూసినవారు
వైసీపీ మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్‌కు షాక్ ఇవ్వనున్న జగన్?
పెందుర్తి నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజుకు 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయంగా ఎదురుదెబ్బ తగలవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన సొంత వ్యాపారాలకే పరిమితమయ్యారని, పార్టీ అధినేత జగన్ హెచ్చరించినా చురుగ్గా ఉండటం లేదని పార్టీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. దీంతో, చురుగ్గా ఉండే ఇతర నేతలకు బాధ్యతలు అప్పగించే యోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్లు సమాచారం. పెందుర్తిలో బలమైన నాయకుడి కోసం అన్వేషణ ప్రారంభమైందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

సంబంధిత పోస్ట్