మాజీ ఎమ్మెల్యే, పెందుర్తి నియోజకవర్గ సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్ రాజ్ ఆధ్వర్యంలో ఆదివారం చిన్నముషిడివాడ జంక్షన్ లో ప్రజా ఉద్యమం ర్యాలీ పోస్టర్ ను ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తూ ప్రజలకు అన్యాయం చేస్తోందని, పేదలకు నాణ్యమైన వైద్య సేవలు, ఉచిత వైద్య విద్యను దూరం చేస్తోందని ఆయన ఆరోపించారు. నియోజకవర్గంలో ప్రారంభమైన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.