పోలవరం నిర్వాశితుల సమస్యలపై ఆదివాసీ జేఏసీ సమావేశం

691చూసినవారు
పోలవరం నిర్వాశితుల సమస్యలపై ఆదివాసీ జేఏసీ సమావేశం
దేవీపట్నం మండలం దండంగి ఆర్. అండ్. ఆర్ కాలనీ కమ్యూనిటీ హాలులో ఆరు మండలాల పోలవరం నిర్వాశితుల సమస్యలపై ఆదివారం ఏ. పి. ఆదివాసీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి కారం రామన్న దొర అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆల్ ఇండియా ఆదివాసీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు కంగల శ్రీనివాస్ మాట్లాడుతూ, నిర్వాశితుల భూములన్నీ ఆన్ లైన్ చేసి, వరి విత్తనాలు, సంక్షేమ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ పోరాట యోధుల చిత్రపటాలకు ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ నివాళులర్పించారు. శ్రీనివాస్ 1/70 చట్టం, పీసా, అటవీ హక్కుల చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్