జూన్ 28, ఆదివారం నాడు పోలవరం జిల్లాలో 28,265 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడానికి తల్లిదండ్రులు సహకరించాలని కలెక్టర్ దినేష్ కుమార్ కోరారు. రంపచోడవరంలో జరిగిన సమావేశంలో, కొండ ప్రాంతాల్లోని 68 ఆవాసాలలో 1,105 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, 651 బూత్ ల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో Dmho డా. సరిత, జిల్లా ఇమ్యూనైజేషన్ ఆఫీసర్ నీలిమ పాల్గొన్నారు.