మహిళల భద్రతపై అవగాహన ర్యాలీ, మానవహారం

1153చూసినవారు
మహిళల భద్రతపై అవగాహన ర్యాలీ, మానవహారం
అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం పరిధిలోని మారేడుమిల్లి సెంటర్‌లో మహిళల భద్రతపై అవగాహన సదస్సు, ర్యాలీ, మానవహారం నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీ అమిత్ బర్దర్ ఐపీఎస్, ఓఎస్డీ శ్రీ పంకాజ్ కుమార్ మీనా ఐపీఎస్, డీఎస్పీ శ్రీ అష్రాఫ్ అలీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది. మహిళలు ప్రయాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అత్యవసర సమయాల్లో శక్తి యాప్, 112 కాల్ వంటి వాటిని ఉపయోగించుకోవడం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ సీఐ శ్రీ కన్నపరాజు, మారేడుమిల్లి సీఐ శ్రీ బి నరసింహమూర్తి, ఎస్సై కే శ్రీనివాసరావు, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్