రంపచోడవరం సచివాలయంలో ఆదివారం, జూన్ 28న, పోలవరం జిల్లా దినేష్ కుమార్ తన కుమారుడికి పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లాలో 2,985 మంది సిబ్బందితో 651 పోలియో బూత్‌ల ద్వారా 28,675 మందికి పోలియో చుక్కలు వేయనున్నట్లు తెలిపారు. 45 మంది వైద్య అధికారులు, 103 మంది సూపర్‌వైజర్లు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు.