గంగవరం మండలం బాపనమ్మ తల్లి గుడి వద్ద జరిగే ఏరువాక కార్యక్రమం, కరకపాడులో జరిగే మహా కుంభాభిషేకంలో ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్ పర్సన్ మిరియాల శిరీషా దేవిసోమవారం పాల్గొంటారు. మధ్యాహ్నం 11.30 గంటలకు రంపచోడవరం క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ, దేవీపట్నం మండలం ఇందుకూరు నుండి కొత్తవీధి వరకూ బీటీ రహదారి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేస్తారు. గంగవరం, దేవీపట్నం మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.