ఓటరు జాబితా లోపాలపై ఎమ్మెల్యే మిరియాల శిరీషా దేవి దిశానిర్దేశం

773చూసినవారు
ఓటరు జాబితా లోపాలపై ఎమ్మెల్యే మిరియాల శిరీషా దేవి దిశానిర్దేశం
గుర్తేడు మండల కేంద్రంలో శనివారం జరిగిన సర్వసభ్య కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్ పర్సన్, ఎమ్మెల్యే మిరియాల శిరీషా దేవి పాల్గొన్నారు. ఓటర్ల జాబితాల్లోని మరణాలు, డబుల్ ఎంట్రీలు, తప్పులను సమగ్రంగా పరిశీలించాలని పార్టీ శ్రేణులకు ఆమె దిశానిర్దేశం చేశారు. ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల ఉపాధ్యక్షులు గొర్లె దుష్యంతుడు, కె. శివశంకర్ రెడ్డి, రామూర్తి, జి. భూపేంద్రం, పి. రాంబాబు, కె. దేవిరెడ్డి, యువకుమార్ పాల్గొన్నారు. ఓటరు జాబితాలో లోపాలపై అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు.

సంబంధిత పోస్ట్