ఎమ్మెల్యే శిరీషా దేవి చేతుల మీదుగా రహదారి పనులకు శంకుస్థాపన

1467చూసినవారు
ఎమ్మెల్యే శిరీషా దేవి చేతుల మీదుగా రహదారి పనులకు శంకుస్థాపన
అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం నియోజకవర్గంలోని దేవీపట్నం మండలం ఇందుకూరు, కొత్తవీధి గ్రామాలకు 4.021 కిలోమీటర్ల బిటి రహదారి పనులకు ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్ పర్సన్ మిరియాల శిరీషా దేవి సోమవారం (జూన్ 28) శంఖుస్థాపన చేశారు. ఈ పనులను నాణ్యతతో చేపట్టాలని ఆమె సూచించారు. దేవీపట్నం మండల కేంద్రంలో 90 శాతం సబ్సిడీపై విత్తనాలు అందిస్తామని తెలిపారు. ఇందుకూరు కొత్తవీధి గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్త తుర్రం విజయ్ మృతి చెందగా, ఎమ్మెల్యే ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో గోళ్ళ చంటిబాబు, AMc డైరెక్టర్ జొన్నల రాంబాబు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్