అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం నియోజకవర్గంలోని గుర్తేడు మండల కేంద్రంలో శనివారం 'ఒక నెల ఒక నియోజకవర్గం' కార్యక్రమం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిరీషా దేవి మాట్లాడుతూ, గ్రామస్థాయి సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం ప్రజల వద్దకే అధికారులు వస్తున్నారని, ఈ సువర్ణ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దినేష్ కుమార్, జేసీ ప్రశాంత్ కుమార్, DRDA PD రత్నాకరరావు, ఇఇ శ్రీనివాస్, DD రుక్మాంగదయ్య, MPDO బాపన్నదొరతో పాటు పలువురు అధికారులు, కూటమి పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.