అల్లూరి సీతారామరాజు జిల్లా, రాజవొమ్మంగి మండలంలో ఆదివారం జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో లక్ష్యానికి మించి 3,337 మంది చిన్నారులకు టీకా వేశారు. 2,602 మందికి టీకా వేయాల్సి ఉండగా, 635 మంది అదనంగా వ్యాక్సిన్ పొందారు. ఈ కార్యక్రమం 128.28 శాతం నమోదైంది. 57 బూత్‌లు, ఏడు రూట్‌లు, మూడు మొబైల్ బృందాలతో పాటు 238 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.