పోలవరం జిల్లా (రంపచోడవరం) కేంద్రంగా అత్యాధునిక ట్రైబల్ స్పోర్ట్స్ అకాడమీని తక్షణమే ఏర్పాటు చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా. రామారావు ప్రభుత్వాన్ని కోరారు. గిరిజన ప్రాంతాల నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేసేందుకు ఈ అకాడమీ దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. అల్లూరి, కారం. తమ్మన్నా దొర వంటి వారు నడయాడిన ఈ ప్రాంతంలో ఎందరో గిరిజన యువతీ యువకులకు శారీరక దారుఢ్యం, విలువిద్య, పరుగు పందాలు వంటి క్రీడల్లో అద్భుతమైన నైపుణ్యాలున్నాయని, వారికి సరైన శిక్షణ అందిస్తే గొప్ప క్రీడాకారులుగా రాణిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.