మారేడుమిల్లి మండలం సున్నంపాడు పంచాయతీ నూరుపూడి గ్రామంలో మంచి నీటి సమస్య తీవ్రంగా ఉంది. సుమారు 8 నెలల క్రితం బోరు కొట్టినా, విద్యుత్ కనెక్షన్ ఇవ్వకపోవడంతో పాటు, తెచ్చిన వాటర్ ట్యాంకును రోడ్డుపైనే వదిలేసి వెళ్లడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బోరుకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చి, ట్యాంకును నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. కత్తుల లచ్చి రెడ్డి, చేదల రామిరెడ్డి, కల్లి ఆది రెడ్డి, చీమల సురేష్ దొర, కోటం గంగన్న, మడకం కన్నాపు దొరతో పాటు గ్రామస్తులు ఈ విజ్ఞప్తి చేశారు.