మారేడుమిల్లి మండలం పరిధిలోని 'గుడిసె గ్రామాన్ని' టూరిజం హబ్‌గా మార్చే ప్రతిపాదనపై ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా.రామారావు తీవ్రంగా స్పందించారు. ప్రకృతిని కాపాడుతూ ప్రగతి సాధించాలనే నినాదం బాగున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఇది గిరిజనుల ఉపాధిని దెబ్బతీసి, మైదాన ప్రాంత వ్యాపార శక్తులకు దోహదపడకూడదని ఆయన అన్నారు. కార్పొరేట్ శక్తుల పాలు కాకుండా, గిరిజన చట్టాలను తుంగలో తొక్కితే సహించేది లేదని హెచ్చరించారు.