రోడ్డు నిర్మాణం చేపట్టండి మహాప్రభోఅని వేడుకుంటున్న గిరిజనులు

649చూసినవారు
రోడ్డు నిర్మాణం చేపట్టండి మహాప్రభోఅని వేడుకుంటున్న గిరిజనులు
మారేడుమిల్లి మండలం సున్నంపాడు పంచాయతీ నూరుపూడిగ్రామం నుండి భూసిగూడెం గ్రామం వరకు మంజూరైన తారు రోడ్డు పనులు అధికారులు నిర్లక్ష్యంగా చేస్తున్నారని, రోడ్డు ఎక్కడపడితే అక్కడ గుట్టలు గుట్టలుగా వేసి ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గత కొన్ని రోజులుగా పనులు నిలిచిపోయాయని, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా స్పందన లేదని, కలెక్టర్ ఐటీడీఏ పి.ఓ. స్పందించి రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఈ మేరకు కత్తుల లచ్చి రెడ్డి, చేదల రామిరెడ్డి, కల్లి ఆది రెడ్డి, పేస కమిటీ, చీమల సురేష్ దొర, కోటంగంగన్న, మడకం కన్నాపు దొర తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్