పోలియో చుక్కలు వేయాలని జడ్పీటీసీ వడుగుల జ్యోతి పిలుపు

1081చూసినవారు
పోలియో చుక్కలు వేయాలని జడ్పీటీసీ వడుగుల జ్యోతి పిలుపు
అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం పరిధిలోని రాజవొమ్మంగి మండలం జడ్డంగి పి. హెచ్. సి లో ఆదివారం చిన్నారులకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని జడ్పీటీసీ వడుగుల జ్యోతి ప్రారంభించారు. పి. హెచ్. సి పరిధిలోని 41 గ్రామాల్లో 867 మంది చిన్నారులకు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని ఆమె సూచించారు. డా. పావని ఈ వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గొడుగు నాగవాసు, పద్ధరాజు, చిన్నమ్ములు, దుర్గ, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్