విశాఖపట్నంలో గత 13 సంవత్సరాలుగా సృజనాత్మక విద్య, డిజైన్ రంగంలో ప్రతిభావంతులైన యువతను తీర్చిదిద్దడంలో విశిష్ట సేవలందిస్తున్న జేడీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, విశాఖపట్నం ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకమైన జేడీ యాన్యువల్ డిజైన్ అవార్డ్స్ (ADA)–2026 కార్యక్రమం 28వ తేదీ సాయంత్రం 6 గంటలకు నవోటెల్, విశాఖపట్నంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవెంట్ మేనేజర్ దాడి రవికుమార్, విద్యావేత్తలు, పారిశ్రామిక వేత్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 13 ఏళ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఈ అవార్డులు ప్రదానం చేశారు.