
విశాఖలో బీభత్సం సృష్టించిన ఈదురు గాలులు
విశాఖపట్నంలో గురువారం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. చినవాల్తేర్, ఈస్ట్ పాయింట్ కాలనీ, జీవీఎంసీ ఆఫీస్, సీతంపేట రోడ్లో బలమైన గాలుల కారణంగా పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి, హోర్డింగ్లు పడిపోయాయి. జీవీఎంసీ ఆఫీసు వద్ద భారీ వృక్షం అమాంతం కారుపై పడటంతో అందులో ఉన్నవారు తృటిలో తప్పించుకున్నారు. ఈ భయానక దృశ్యాలు సీసీ ఫుటేజీలోనూ రికార్డయ్యాయి.




































