
మునగపాక: పేకాట శిబిరంపై దాడి.. 8 మంది అరెస్ట్
మునగపాక మండలంలోని పల్లపు ఆనందపురం గ్రామ శివార్లలో పేకాట ఆడుతున్న స్థావరంపై శుక్రవారం పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.79,600 నగదుతో పాటు 7 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.






































