ఎలమంచిలి పట్టణంలోని టిడ్కో అపార్ట్మెంట్ కాలనీలో పోలీసులు శనివారం ఉదయం కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చేపట్టిన ఈ తనిఖీల్లో వాహనాలు, వ్యక్తుల వివరాలను పరిశీలించారు. ఎటువంటి ధ్రువపత్రాలు, రికార్డులు లేని 10 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ ఎస్సై సావిత్రి తెలిపారు. అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ, నేరాల నివారణ లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు.