అగ్ని ప్రమాదానికి గురైన వృద్ధురాలు మృతి

293చూసినవారు
అగ్ని ప్రమాదానికి గురైన వృద్ధురాలు మృతి
యలమంచిలి మండలం లక్కవరంలో చలిమంట కాచుకుంటున్న తేలు రమణమ్మ (80) అనే వృద్ధురాలు అగ్ని ప్రమాదంలో మృతి చెందింది. ఈ నెల 3న కట్టెల పొయ్యి వద్ద వేడినీళ్లు కాచుకుంటుండగా ఆమె చీరకు నిప్పు అంటుకుంది. తీవ్రంగా గాయపడిన ఆమెను విశాఖ కేజీహెచ్‌కు తరలించగా, చికిత్స పొందుతూ శుక్రవారం మరణించింది. మృతదేహానికి శవపరీక్ష నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్