బోటు బోల్తా పడి మత్స్యకారుడు మృతి

40చూసినవారు
బోటు బోల్తా పడి మత్స్యకారుడు మృతి
అచ్యుతాపురం మండలం పూడిమడక తీరానికి సమీపంలో చేపల వేటకు వెళ్లిన బోటు అలల ఉదృతికి బోల్తా పడటంతో ఓ మత్స్యకారుడు మృతి చెందాడు. చౌడిపల్లి దేముడు (41) తో పాటు మరో నలుగురు బోటులో వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. నలుగురు సురక్షితంగా బయటపడగా, దేముడు నీటిలో మునిగి మరణించారు. గత ఆరు నెలల్లో ఇలాంటి ఘటనల్లో నలుగురు మత్స్యకారులు మృతి చెందడం ఇది నాలుగోసారి.

సంబంధిత పోస్ట్