హరిపాలెం సర్పంచి కన్నుమూత

694చూసినవారు
హరిపాలెం సర్పంచి కన్నుమూత
అచ్యుతాపురం మండలం హరిపాలెం గ్రామ సర్పంచ్ మారిశెట్టి సూర్యకాంతం మంగళవారం ఉదయం అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. గ్రామ అభివృద్ధిలో చురుకైన పాత్ర పోషించిన సూర్యకాంతం మృతి పట్ల వైసీపీ నాయకులు, కార్యకర్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మృతి పార్టీకి తీరని లోటు అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్