నీళ్ల ట్యాంకర్ ను ఢీకొని లారీ డ్రైవర్ మృతి

298చూసినవారు
నీళ్ల ట్యాంకర్ ను ఢీకొని లారీ డ్రైవర్ మృతి
యలమంచిలి మండలం పులపర్తి సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై నీళ్ల ట్యాంకర్ ను వెనుక వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ హెచ్. వెంటయ్య (51) అక్కడికక్కడే మృతి చెందాడు. అనకాపల్లి నుంచి తుని వైపు వెళ్తున్న రోడ్డు డివైడర్లపై ఉన్న మొక్కలను తడుపుతున్న ట్యాంకర్ ను వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో నీళ్ల ట్యాంకర్ రోడ్డుపై బోల్తాపడింది. ట్యాంకర్ లో ఉన్న ఇద్దరు సురక్షితంగా బయట పడ్డారు. మృతుడు తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాకు చెందినవాడిగా గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్