యలమంచిలిలో ఘోర రోడ్డు ప్రమాదం: మంత్రి అనిత స్వయంగా తరలింపు

211చూసినవారు
యలమంచిలి సమీపంలోని కొక్కిరాపల్లి వద్ద సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో, టాటా మ్యాజిక్ వాహనాలు ఢీకొని పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌తో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను తమ కాన్వాయ్ వాహనాల్లో స్వయంగా యలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. మంత్రి అనిత మానవతా చర్య స్థానికంగా ప్రశంసలు అందుకుంటోంది.

సంబంధిత పోస్ట్