మునగపాక ఎంపీపీ ఎన్నికలో జనసేనకు షాక్

739చూసినవారు
మునగపాక ఎంపీపీ ఎన్నికలో జనసేనకు షాక్
మునగపాక ఎంపీపీ ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి ఘన విజయం సాధించింది. గత ఎంపీపీ జయమ్మ జనసేనలో చేరడంతో వైఎస్ఆర్సిపి అవిశ్వాసం పెట్టింది. ఈ నేపథ్యంలో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి ఎంపీపీతో పాటు రెండు వైస్ ఎంపీపీ పదవులను కైవసం చేసుకుంది. ఎంపీపీగా మొల్లేటి కృష్ణవేణి, వైస్ ఎంపీపీలుగా మళ్ల కాశీ సురేష్, కర్రీ సంజీవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఫలితాలు జనసేనకు పెద్ద షాక్ గా నిలిచాయి.